సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని పలు ప్రాంతాల్లో హోలీ సందర్భంగా కామ దహనం చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆనందంతో చిన్న పెద్ద, కుల మత, వయో వృద్ధ, స్త్రీ పురుష బేధం లేకుండా హోలీ సంబురాల్లో మునిగితేలారు.
చెడుకు పతనం.. మంచికి అందలం కోసమే కామ దహనం - KAAMA DHANAM IN CANTONMENT, SECUNDERABAD
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా కామ దహనం చేశారు.

ఘనంగా హోలీ సంబురాలు
పౌర్ణమికి ముందు రోజు రాత్రి అన్ని ప్రాంతాల్లో కాముడి దహనం జరపడం ఆనవాయితీగా వస్తోంది.. వెదురు కర్రలకు కుడకలు, చక్కెర బిల్లలు కట్టి సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం కాముడి దహనం చేశారు.
ఘనంగా హోలీ సంబురాలు