KA Paul Meets Revanth Reddy in Hyderabad : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy), ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు కేఏ పాల్ తెలిపారు. గ్లోబల్ పీస్ సదస్సుకు కావాల్సిన అనుమతులను సైతం మంజూరు చేయాల్సిందిగా కేఏ పాల్ కోరారు.
అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. అనంతరం ఈ విషయాన్ని కేఏ పాల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సదస్సుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు పలు దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు హాజరవ్వనున్నట్లు వెల్లడించారు.