KA Paul House Arrest: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ను పోలీసులు గృహనిర్భంధం చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసేందుకు ఇంటి నుంచి కేఏ పాల్ బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు.. కేఏ పాల్‌ను ఇంటి వద్దనే అడ్డుకున్నారు. అనుమతి లేదని హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం తనపై జరిగిన దాడి గురించి డీజీపీకి ఫిర్యాదు చేస్తానని.. అందుకే వెళ్తున్నట్లు చెప్పినప్పటికీ.. పోలీసులు ఆయన్ని గృహనిర్భంధం చేశారు.
అసలు సోమవారం ఏం జరిగిందంటే..రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి కేఏ పాల్ వెళ్తుండగా.. ఆయనపై తెరాస నేత చేయి చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేఏపాల్ పర్యటనకు అనుమతి లేదని.. జిల్లాకు రాకుండా పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న తెరాస శ్రేణులు అక్కడికి చేరుకున్నారు.