KA Paul letter to Ambedkar statue: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని వాపోయారు. పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి పోతున్నారని... లక్షల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్‌కు 25 ఎంపీలు ఇస్తే, మోదీకి మసాజ్ చేస్తున్నారు: కేఏ పాల్ - జగన్‌కి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు అంటున్నారు
KA Paul letter to Ambedkar statue: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినతి పత్రం సమర్పించారు. జగన్‌కి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
ఎక్కడికి వెళ్లినా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు జగన్‌కు ఓటు వేస్తే "బుద్ధి వచ్చింది !" అని బాధ పడుతున్నారన్నారు. అవినీతి కేసుల నుంచి బయటపడడానికి జగన్ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నారు. జగన్‌కు 25 ఎంపీలు ఇస్తే కేంద్రాన్ని కదిలిస్తా అన్నారు. కానీ ఇప్పుడు మోదీకి మసాజ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: