New president Of Hyderabad District Unit: హైదరాబాద్ జిల్లా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ యూనియన్ ఎన్నికలు శనివారం జరిగాయి. ఎన్నికల అధికారిగా టీ.శిరీష, సహాయ ఎన్నికల అధికారిగా శ్రీ.కృష్ణయ్య వ్యవహరించారు. హైదరాబాద్ జిల్లా యూనిట్ సంఘం నూతన అధ్యక్షుడిగా కె.సుధీర్ బాబు విజయదుందుభి మోగించారు.
సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ గా కృష్ణ మోహన్, వైస్ ప్రెసిడెంట్ గా కె.చంద్రశేఖర్, ఎండీ.అజర్ హుస్సేన్ గెలవగా, కార్యదర్శిగా బి.నవీన్ కుమార్, జాయింట్ సెక్రటరీ జీ. అమృతదానం, బీ.వీణ ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎస్.కే పద్మజకు ఎన్నికల ప్రొసీడింగ్స్ అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ప్రదీప్, ప్రధాన కార్యదర్శి సతీష్, ఇతర రాష్ట్ర కార్యవర్గం రవికుమార్, రాజగోపాలాచారి, తదితరులు కొత్త కమిటీకి అభినందనలు తెలియజేశారు.