భాజపాకి సుశిక్షితులైన కరసేవకులు ఉండడం వల్లే జాతీయ స్థాయిలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్‌లో భాజపా గ్రేటర్ ఉపాధ్యక్షుడు కొండపల్లి మాధవ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కృషి చేసిన నియోజకవర్గ కరసేవకులకు ఆయన సత్కారం చేశారు.
'రామ మందిర్ నిర్మాణం కోసం 30 ఏళ్ల రాజకీయ పోరాటం'
ముషీరాబాద్ నియోజకవర్గం కరసేవకులను మాజీ ఎమ్మెల్యే, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సన్మానించారు. నాడు కరసేవకులు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా సేవ చేశారని కొనియాడారు.
'రామ మందిర్ నిర్మాణం కోసం 30 ఏళ్ల రాజకీయ పోరాటం'
అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం 70 ఏళ్ల న్యాయ పోరాటం, 30 ఏళ్లు రాజకీయ పోరాటం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి వల్లే ఆ వివాదం సఫలీకృతం అయిందన్నారు. కరసేవకులు నిర్మాణాత్మక పోరాట పటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి :'హిందూ సంప్రదాయానికి ఆధునిక చిహ్నం రామాలయం'