పరస్పరం రాష్ట్రాలు మార్చుకుంటూ తాను, కేవీపీ కేంద్రానికి లేఖలు ఇచ్చినట్లు రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తెలిపారు. అప్పటి కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ ఆదేశాలు కూడా ఇచ్చారని... 2014లో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారని ఆయన వెల్లడించారు. కేవీపీకి తెలంగాణలో సాధారణ ఓటుహక్కు కూడా లేదని, ఇద్దరికి ఓటుహక్కు ఇవ్వడం సరికాదని తెలిపారు.
'నేనేతప్పూ చేయలేదు.. కేవీపీకి తెలంగాణలో ఓటే లేదు' - MP K. KESHAVARAO LATEST NEWS
తాను తప్పు ఓటు వేశానని అనడం సబబు కాదని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఉన్నారు. కేవీపీకి తెలంగాణలో సాధారణ ఓటు హక్కు కూడా లేదని చెప్పారు.
'నేను తప్పు ఓటు వేశానని అనడం సబబు కాదు'
తానెలాగూ ఓటు వేశానని... కేవీపీకి ఓటుహక్కు ఇస్తారో లేదో ఎస్ఈసీ చూసుకోవాలి పేర్కొన్నారు. తాను తప్పు ఓటు వేశానని అనడం సబబు కాదని కేశవరావు అన్నారు. వాస్తవాలన్నింటినీ ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లానని స్పష్టం చేశారు. తప్పు ఎక్కడ జరిగిందన్నది తానెలా చెబుతానని కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: 'ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు'