New Legal Services Authorities Started: రాష్ట్రంలో కొత్త జిల్లాలకు అనుగుణంగా న్యాయ సేవాధికార సంస్థలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 23 న్యాయసేవాధికార సంస్థలను రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేగంగా నూతన న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయగలిగినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు.
న్యాయవ్యవస్థలో లీగల్ ఎయిడ్ ఓ భాగమైందని అన్నారు. న్యాయసహాయం పొందడం ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కు అని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. లీగల్ ఎయిడ్ అందించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత జడ్జీలతో పాటు.. న్యాయవ్యవస్థలోని అందరిపై ఉందని వెల్లడించారు. లోక్ అదాలత్ను సమర్థంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త సంవత్సరం అందరూ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.