తెలంగాణ

telangana

ETV Bharat / state

Disha Encounter: ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టా? అంటే ఏమిటి? నాకసలు దాని అర్థమే తెలియదు!: సజ్జనార్ - ఎన్​కౌంటర్​ స్పెషలిస్ట్

దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ (RTC MD Sajjanar)ను కమిషన్​ రెండో రోజూ విచారించింది. ఎన్​కౌంటర్, ఆ తర్వాత పోస్టుమార్టం, మృతదేహాల తరలింపునకు సంబంధించిన వివరాలపై ఆరా తీసింది. ఏమి అడిగినా తనకు తెలియదనే జవాబు రావడంపై కమిషన్​ అసహనం వ్యక్తం చేసింది.

cp sajjanar
ఆర్టీసీ ఎండీ సజ్జనార్

By

Published : Oct 13, 2021, 7:05 AM IST

‘‘మిమ్మల్ని అంతా ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ అని అంటారట కదా! దానికి అర్థం ఏమిటో చెబుతారా’’ అని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ (RTC MD Sajjanar)ను జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ప్రశ్నించింది. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ సమయంలో సైబరాబాద్‌ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌ను జస్టిస్‌ సిర్పుర్కర్‌ (justice sirpurkar commission)తో పాటు కమిషన్‌ తరఫు న్యాయవాదులు మంగళవారం పలు అంశాలపై ప్రశ్నించారు. ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ (Encounter Specialist)’ అనే పదానికి తనకు అర్థం తెలియదని సజ్జనార్‌ (RTC MD Sajjanar) సమాధానమిచ్చారు. మీడియాలో అలా పెద్దఎత్తున ప్రచారం జరిగినా ఎందుకు ఖండించలేదని అడగగా ఆయన స్పందించలేదు. ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆయుధాలను ఏరోజు జప్తు చేశారని అడిగితే తెలియదన్నారు. ఎన్‌కౌంటర్‌ స్థలంలో టెంట్లు ఎవరు వేయించారన్న (justice sirpurkar commission) ప్రశ్నకూ తెలియదని సమాధానమిచ్చారు. నిందితులు మైనర్లు అనే విషయం తెలియదా అని అడిగితే లేదని చెప్పారు.

‘దిశ’ అదృశ్యంపై ఆమె కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదు, ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు ఆలస్యంగా నమోదు చేశారన్న (justice sirpurkar commission) ప్రశ్నలకు అందుకు కారకులైన పోలీసులను అప్పుడే సస్పెండ్‌ చేశామన్నారు. ఆ విషయంపై విచారణ ఏ స్థాయిలో ఉందని ప్రశ్నించగా తనకు తెలియదన్నారు. ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన ఆయుధాల్ని ఎప్పుడు జప్తు చేశారో తెలియదని సమాధానమిచ్చారు. ఎన్‌కౌంటర్‌లో దర్యాప్తు అధికారి తీరు సరిగా లేదని అనిపించలేదా అన్న ప్రశ్నకు లేదని చెప్పారు. ‘‘అత్యాచారం కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నప్పుడు ఒక్క నిందితుడి వాంగ్మూలం ఆధారంగానే ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించడం సరికాదు అనిపించలేదా? మిగిలిన నిందితుల వాంగ్మూలాలు సేకరించకుండానే అలా వెల్లడించడం వల్ల న్యాయవిచారణకు ఆటంకం కలుగుతుందని తెలియదా’’ అని అడగగా.. ఆ సమయంలో అలా భావించలేదని బదులిచ్చారు. ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై ఓవైపు ఇంక్వెస్ట్‌(విచారణ) జరుగుతుండగానే మరోవైపు ప్రెస్‌మీట్‌ ఎలా పెట్టారన్న ప్రశ్నకు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి (Shamshabad DCP Prakash Reddy) వివరాలు వెల్లడించాలని చెబితే పెట్టానన్నారు. నిందితులను సేఫ్‌హౌస్‌లో విచారించిన సంగతి తెలుసా అని అడగగా.. డీసీపీ (Shamshabad DCP Prakash Reddy) చెప్పారని తెలిపారు.

ఏం అడిగినా తనకు తెలియదని.. డీసీపీ (Shamshabad DCP Prakash Reddy)కే తెలుసు అని సజ్జనార్‌ (RTC MD Sajjanar) చెప్పడంపై ‘సొంతంగా ఆలోచించలేదా’ అంటూ జస్టిస్‌ సిర్పుర్కర్‌ (justice sirpurkar commission) అసహనం వ్యక్తం చేశారు. తాను సమీక్షలు మాత్రమే నిర్వహించానని ఆయన బదులిచ్చారు. పోలీసుల దగ్గరి నుంచి నిందితులు ఆయుధాల్ని లాక్కున్నప్పుడు అవి లాక్‌ చేసి లేవా అంటే ఉన్నాయని చెప్పారు. ఎన్‌కౌంటర్‌ అనంతరం ప్రెస్‌మీట్‌లో అన్‌లాక్‌ ఉన్నాయని ఎలా చెప్పారని కమిషన్‌ ప్రశ్నిస్తూ సంబంధిత వీడియోను ప్రదర్శించింది. అప్పుడు ఘటనాస్థలిలో గందరగోళం, హడావుడి ఉండటంతో అలా చెప్పి ఉంటానని సజ్జనార్‌ (RTC MD Sajjanar) తెలిపారు. ‘దిశ’కు సంబంధించిన వస్తువులను జప్తు చేశారా అన్న ప్రశ్నకు తనకు గుర్తులేదన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ మార్గదర్శకాల ప్రకారం ఎన్‌కౌంటర్‌ ఘటనను జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌తో కాకుండా ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌తో పంచనామా ఎలా చేయించారని అడగగా తమ న్యాయ సలహాదారు సూచనతో చేయించామన్నారు.

తెలుగును తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే..

తెలుగును తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే పొరపాటు పడి ఉంటానని విచారణ క్రమంలో వీసీ సజ్జనార్‌ (RTC MD Sajjanar) పలుమార్లు సమాధానమిచ్చారు. తెలుగు రాష్ట్రానికి ఐపీఎస్‌గా ఎంపికైనప్పుడు ఆ భాషలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి కదా అని అడిగితే అవునన్నారు. అలాంటప్పుడు ఇన్ని రోజులు తెలుగు అర్థం చేసుకోకుండానే విధులు నిర్వర్తిస్తున్నారా అని కమిషన్‌ అడిగింది. తన మాతృభాష కన్నడకు, తెలుగుకు దగ్గరి సంబంధం ఉండటంతో తనకు తెలుగు రాయడం, చదవడం తెలుసన్నారు. మాట్లాడటమే పూర్తిగా తెలియదన్నారు. రెండు రోజుల పాటు సాగిన విచారణ (justice sirpurkar commission)లో సజ్జనార్‌ను కమిషన్‌ 160 ప్రశ్నలడిగింది. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని (Shamshabad DCP Prakash Reddy) మరోసారి విచారణకు రావాలని కమిషన్‌ పిలవనుంది. నిందితులు వినియోగించిన సెల్‌ఫోన్‌లకు సంబంధించిన గురించి బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో, ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ప్రొవైడర్లనూ కమిషన్‌ మంగళవారం విచారించింది. నిందితులకు సంబంధించిన కాల్‌డేటా రికార్డులను ఎవరు అడిగితే ఇచ్చారని ప్రశ్నించగా ఎస్‌వోటీ డీసీపీ సురేందర్‌రెడ్డి (SOT DCP Surender Reddy) అడగడంతో ఇచ్చినట్లు ఆయా సంస్థల ప్రతినిధులు వెల్లడించారు.

ఇదీ చూడండి:Disha Encounter Case: 'ఆ సమయంలో కొన్ని తప్పుగా మాట్లాడాను': విచారణలో సజ్జనార్​

Disha Encounter Case: సజ్జనార్​ను రెండోరోజు ప్రశ్నిస్తున్న సిర్పూర్కర్ కమిషన్

Disha encounter case: 'ఆస్పత్రిలో చేర్పించిన సమయాల్లో తేడాలు ఎందుకున్నాయి?'

ABOUT THE AUTHOR

...view details