తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2021, 8:59 PM IST

ETV Bharat / state

CJI: సీజేఐకి గ్రీన్​ ఛాలెంజ్​... రాజ్​భవన్​లో మొక్క నాటిన జస్టిస్ ఎన్వీ రమణ

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్​ కుమార్ గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా సీజేఐ(CJI) ఎన్వీ రమణ... రాజ్​భవన్​లో మొక్క నాటారు. అనంతరం ఎంపీ సంతోష్​ కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని సీజేఐకి బహుకరించారు.

Justice NV Ramana
సీజేఐకి గ్రీన్​ ఛాలెంజ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్వీ రమణ (Justice Nv Ramana)ను పలువురు ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్​ కుమార్ గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా సీజేఐ రమణ రాజ్​భవన్​లో మొక్క నాటారు. అనంతరం ఎంపీ సంతోష్​ కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని సీజేఐకి బహుకరించారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు జస్టిస్ ఎన్వీ రమణ (Justice Nv Ramana)ను కలిసి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయలు ఏకీకృత సర్వీసుల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి, విప్ భానుప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య నేతలు జస్టిస్ ఎన్వీ రమణ(Justice Nv Ramana)ను కలిసి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వివాదానికి పరిష్కారం చూపాలని కోరారు.

వృక్షవేదం పుస్తక బహుకరణ

ఇదీ చదవండి:DASOJU SRAVAN: అప్పుడు వ్యతిరేకించి ఇప్పడెందుకు అమ్ముతున్నారు?

ABOUT THE AUTHOR

...view details