విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యను పరిష్కరించేందుకు జస్టిస్ ధర్మాధికారి తెలుగు రాష్ట్రాల అధికారులు, ఉద్యోగులతో దిల్లీలోని ఒబేరాయ్ హోటల్లో భేటీ అయ్యారు. సమావేశంలో అధికారులు, ఉద్యోగుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. జస్టిస్ ధర్మాధికారి చెప్పినట్లుగా 656 మంది ఉద్యోగులు...తమకు భారమని ఏపీ డిస్కంలు పేర్కొన్నాయి.
ఇదే చివరి సమావేశం: జస్టిస్ ధర్మాధికారి - Justice Dharmadikari committee
తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఇదే చివరి సమావేశమని జస్టిస్ ధర్మాధికారి స్పష్టం చేశారు. ఉద్యోగుల విభజన సమస్యపై ఇరు రాష్ట్రాల అధికారులతో దిల్లీలో జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇవాళ చర్చించింది.
ఇదే చివరి సమావేశం: జస్టిస్ ధర్మాధికారి
కమిటీ నివేదికలో సమస్యలు ఉన్నాయన్న తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు... సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకే నివేదికను అంగీకరించినట్లు తెలిపారు. వారం రోజుల్లో సప్లిమెంటరీ నివేదిక ఇస్తామని జస్టిస్ ధర్మాధికారి వెల్లడించారు. సమావేశం ఫలవంతమైందని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఇదే చివరి సమావేశమని జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేశారు.