తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవకతవకలపై విచారణ జరిపించాలి' - జస్టిస్‌ చంద్రకుమార్‌

వ్యక్తిగత లాభం కోసం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని తెలంగాణ ప్రజాపార్టీ అధ్యక్షుడు జస్టిస్​ చంద్రకుమార్​ ఆరోపించారు. ఏమాత్రం అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి 24 మంది విద్యార్థుల మరణానికి కారణమయ్యారని మండిపడ్డారు.

justice-chandrakumar

By

Published : Apr 30, 2019, 5:59 PM IST

పరీక్షల్లో తప్పినంత మాత్రాన విద్యార్థుల భవిష్యత్‌ అంధకారం కాదని తెలంగాణ ప్రజా పార్టీ అధ్యక్షడు జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. విద్యా వ్యవస్థలో ఒత్తిడి వల్లే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. విద్యావ్యవస్థ వ్యాపారంగా మారిపోయిందని ఆరోపించారు. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

'అవకతవకలపై విచారణ జరిపించాలి'
ఇదీ చదవండి: ఆత్మహత్యలు కావు అవి ప్రభుత్వ హత్యలే: అరుణ

ABOUT THE AUTHOR

...view details