ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. న్యాయస్థానాలను ధిక్కరిస్తే చరిత్రలో ఏం జరిగిందో ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుంచుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ఎవరిమాట వినకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆర్టీసి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రిలో చలనం లేకపోవడం దారుణమని కృష్ణయ్య మండిపడ్డారు.
'న్యాయస్థానాలను ధిక్కరిస్తే మూల్యం తప్పదు' - కేసీఆర్ చరిత్రను గుర్తుంచుకోవాలి:
న్యాయస్థానాలను ధిక్కరిస్తే చరిత్రలో ఏం జరిగిందో ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుంచుకోవాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మహాసభలో ఆయన పాల్గొన్నారు.
జస్టిస్ చంద్రకుమార్