తెలంగాణ

telangana

లోకాయుక్తగా జస్టిస్‌ వెంకటరాములు.. హెచ్​ఆర్సీ ఛైర్మన్​గా జస్టిస్ చంద్రయ్య

By

Published : Dec 19, 2019, 7:30 PM IST

Updated : Dec 19, 2019, 10:51 PM IST

లోకాయుక్త, మానవహక్కుల సంఘం ఛైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తైంది. లోకాయుక్తగా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములును ప్రభుత్వం నియమించింది. మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్​గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య నియమితులయ్యారు.

లోకాయుక్త జస్టిస్‌ వెంకటరాములు..
లోకాయుక్త జస్టిస్‌ వెంకటరాములు..

తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించింది. లోకాయుక్తగా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములును నియమించింది. ఉపలోకాయుక్తగా విశ్రాంత జిల్లా జడ్జి, ప్రభుత్వ న్యాయ శాఖ మాజీ కార్యదర్శి జి.నిరంజన్ రావు పేరు సిఫార్సు చేయగా గవర్నర్ తమిళిసై ఆమోదించారు.

మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్​ జస్టిస్ చంద్రయ్య

మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్​గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య నియమితులయ్యారు. సభ్యులుగా ఎన్. ఆనందరావు, మొహమద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ పేర్లను గవర్నర్ ఆమోదించారు.

సుదీర్ఘ చర్చ...అనంతరం ఎంపిక

లోకాయుక్త, ఉప లోకాయుక్త, హెచ్ఆర్ సీ ఛైర్మన్, సభ్యుల నియామకం కోసం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులుగా ఉన్న శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ, మండలీలో విపక్ష నాయకులు పాషా ఖాద్రీ, జాఫ్రీ హాజరయ్యారు.సుదీర్ఘంగా చర్చించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు.

ఇవీచూడండి: హైదరాబాద్​లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్

Last Updated : Dec 19, 2019, 10:51 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details