తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల (జూడా) సంఘం బుధవారం నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఫ్రంట్‌లైన్ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కొవిడ్ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని, ఉపకార వేతనంలో టీడీఎస్ కోత విధించొద్దని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడికి సమ్మె నోటీసు పంపించింది.
రేపటి నుంచి విధుల బహిష్కరణకు జూడాల పిలుపు - రేపటి నుంచి జూడాల విధుల బహిష్కరణ
ఏపీ జూనియర్ డాక్టర్ల (జూడా) సంఘం.. రేపటి నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడికి సమ్మె నోటీసు పంపించింది.
రేపటి నుంచి విధుల బహిష్కరణకు జూడా పిలుపు
డిమాండ్లను పరిష్కరించని పక్షంలో బుధవారం నుంచి కొవిడేతర విధులు బహిష్కరిస్తామని జూడా అధ్యక్షుడు రాహుల్‌రాయ్, ప్రధాన కార్యదర్శి వెంకటసాయితేజ పేర్కొన్నారు. 10న కొవిడ్ సంబంధిత, 11న కొవిడేతర అత్యవసర విధుల్ని బహిష్కరిస్తామని తెలిపారు. 12వ తేదీ నుంచి కొవిడ్ సంబంధిత అత్యవసర విధుల్నీ బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి..నేడు కేబినెట్ భేటీ.. లాక్డౌన్ పొడిగింపుపై క్లారిటీ?