కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ఇచ్చిన హామీతో సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు.
విధుల్లోకి జూడాలు - EETALA
జూనియర్ డాక్టర్లు సమ్మెకు తాత్కాలిక విరమణ ప్రకటించారు. ప్రభుత్వ హామీ మేరకు విధులకు హాజరయ్యేందుకు ఒప్పుకున్నారు.

సమ్మె విరమించిన జూడాలు
సమ్మె విరమించిన జూడాలు
మానవత్వంతో సేవ చేసే వైద్యులపై దాడులు చేయటం మంచి పరిణామం కాదని మంత్రి అన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈటల తెలిపారు.
మార్చి 11 వరకు సమస్యలను పరిష్కరిస్తామన్న మంత్రి హామీ నెరవేరితే సమ్మెను పూర్తిగా విరమిస్తామని జూనియర్ వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి:మెరుగైన వైద్యం అందిస్తాం
Last Updated : Mar 1, 2019, 7:43 AM IST