Juda Negotiations Success with Minister Damodara Rajanarsimha : సకాలంలో స్టైఫండ్ విడుదల చేయాలన్న డిమాండ్‌తో సమ్మె తలపెట్టిన జూనియర్ వైద్యులతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు సఫలమయ్యాయి. నేటి నుంచి తలపెట్టిన సమ్మె విరమించుకున్నట్లు జూనియర్ వైద్యుల సంఘం ప్రకటించింది. ఆరు డిమాండ్లపై జూనియర్ వైద్యులతో సచివాలయంలో(Telangana Secretariat) వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు జరిపారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో జూనియర్ డాక్టర్ల నిరసన - డైరెక్టర్‌ను తొలగించాలంటూ డిమాండ్
Juda Demands for Stipend Intime :స్టైఫండ్ క్రమబద్ధీకరణ కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తామని, ప్రతి నెల 15వ తేదీ వరకు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్‌ను 20 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీఎంఈ తెలిపారని జూడాలు పేర్కొన్నారు. డీఎన్బీ విద్యార్థులకుఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్‌ను(Pending Stipend) త్వరలో విడుదల చేసేందుకు మంత్రి అంగీకరించారన్నారు.
ఎంబీబీఎస్ స్టూడెంట్స్, హౌస్ సర్జన్స్, సీనియర్ రెసిడెంట్స్‌కు అందరికీ సరిపడేలా హాస్టళ్లు లేవు. కాబట్టి ఆ సమస్యను వైద్యారోగ్య శాఖ మంత్రికి తెలియజేశాము. మంత్రి దానిపట్ల సానుకూలంగా స్పందించి, ఇంకా ఎన్ని వసతి గృహాలు కావాలో అడిగి అవి నోట్ చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సానుకూల స్పందనను అందించారు. -డా. కార్తీక్, తెలంగాణ జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు
ప్రైవేట్ కాలేజీల పీజీ, ఇంటర్న్ షిప్ విద్యార్థుల స్టైఫండ్‌పై సంబంధిత అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు జూడాలు తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మించేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ అంగీకరించారని, రెండు నెలల్లో శంఖుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు.