జాతీయ మెడికల్ కమిషన్‌కు బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. అత్యవసర వైద్య సేవలను నిలిపివేసి ఆందోళన చేశారు. ర్యాలీగా బయలు దేరి ప్రధాన రహదారిపై బయటించారు. కొద్దిసేపు ట్రాఫీక్ జాం అయ్యింది. ట్రాఫిక్ పోలిసులు జూనియర్ డాక్టర్లతో చర్చించే సమయంలో ఇరువర్గాలకు మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఓ మెడికో గల్లా పట్టుకున్న పోలీసు తీరుతో.. కాస్త ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరకు వాహనాదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులంతా గురువారం ఉదయం 6 గంటల నుంచి 9వ తేది (శుక్రవారం) ఉదయం ఆరు గంటల వరకు వైద్య సేవలను నిలిపివేస్తామని చెప్పారు. ఎన్ఎంసీ బిల్లులోని చట్ట సవరణలు తెచ్చేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చారించారు.
మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత - మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత
జూనియర్ డాక్టర్లంతా కలిసి విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికోలకు పోలీసులకు మధ్య స్వల్ప సంఘర్షణ జరిగినా పట్టు వదలని విక్రమార్కుడిలా చట్ట సవరణ జరగాలంటూ నిరసన తెలిపారు జూడాలు.
మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత