మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వరుసగా ఐదో వారం 'ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ ఆయన తన ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. రానున్న వర్షాకాలం నాటికి దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ఇంటి పరిసరాలు శుభ్రం చేసిన ఎమ్మెల్యే - mla maganti gopinath
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజలంతా ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
![ఇంటి పరిసరాలు శుభ్రం చేసిన ఎమ్మెల్యే jublihills-mla-maganti-gopinath-cleanig-at-home-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7513036-849-7513036-1591516766896.jpg)
ఇంటి పరిసరాలు శుభ్రం చేసిన ఎమ్మెల్యే