హైదరాబాద్ బోరబండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.
ఆరోగ్య పరిస్థితిని..
బోరబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందితో ఎమ్మెల్యే గోపినాథ్‌తో పాటు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ముచ్చటించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు చేసిన సేవలను వారు కొనియాడారు.
ఇదీ చదవండి:రూపాయికే టిఫిన్.. రూ.5కే భోజనం!