తెలంగాణ

telangana

ETV Bharat / state

Jubilee Hills Case Update: 'కస్టడీ పిటిషన్​పై ముగిసిన వాదనలు.. తీర్పు రేపటికి వాయిదా'

Jubilee Hills Case Update: జూబ్లీహిల్స్​లో బాలికపై అత్యాచారం కేసులో నిందితులను ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని కోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించారు.

By

Published : Jun 7, 2022, 4:57 PM IST

Updated : Jun 7, 2022, 7:29 PM IST

Jublihills Case update
జూబ్లీహిల్స్​లో బాలికపై అత్యాచారం

Jubilee Hills Case Update: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుల కస్టడీపై తీర్పును నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. వాదనలు విన్న న్యాయస్థానం రేపు తీర్పును వెలువరించనుంది. సాదుద్దీన్ అనే నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మైనర్​పై అత్యాచారానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. నేరం జరిగిన విధానాన్ని నిందితుడి నుంచి రాబట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ ఘటనలో ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉందనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ఇప్పటికే ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ముగ్గురు మైనర్లతో పాటు సాదుద్దీన్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. మరో నిందితుడు ఉమేర్ ఖాన్ పరారీలో ఉన్నాడు. మైనర్ బాలికపై అత్యాచారంలో ఎంత మంది ప్రమేయం ఉందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే బాధిత బాలిక నుంచి పోలీసులు రెండుసార్లు వివరాలు సేకరించారు. అత్యాచారం జరిగిన రోజు... పబ్​లోనే మరో బాలికతో నిందితులు అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు పబ్ లోని సీసీ కెమెరాల నుంచి దృశ్యాలు సేకరించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వస్తాయని జూబ్లీహిల్స్ పోలీసులు భావిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

Jubilee Hills Gang Rape Case: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో.. ఐదుగురు నిందితుల ప్రమేయం ఉన్నట్టు భావిస్తోన్న పోలీసులు ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు మైనర్ కావడం వల్లే శనివారం ఉదయం అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం.ఈ కేసులో నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. మిగతా నిందితుల వేటలో ఉన్నారు. నిందితులు గోవావైపు వెళ్లినట్టు పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

గత నెల 28న ఓ బాలిక (17) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. దాదాపు 150 మంది 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే మద్యం రహిత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసే సమయానికి పావుగంట ముందు పబ్‌ నుంచి బాలిక బయటకు వచ్చింది. అక్కడే ఉన్న రెండు కార్లలో యువతితో పాటు మరో 8మంది యువకులు బయల్దేరారు. ఇందులో బెంజికారుతో పాటు ఇన్నోవా కారు కూడా ఉంది. బెంజికారులో ప్రముుఖుల కుమారులు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం బాలిక.. వారితో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరింది. నిర్జన ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం 7.30గంటలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:రాష్ట్ర సర్కారుపై సుప్రీం ఆగ్రహం.. ఆ కేసులో జరిమానా చెల్లించనందుకే!

చేతిపై రేపిస్ట్ పేరు రాసుకుని బాలిక ఆత్మహత్య.. రెండేళ్లుగా మౌనంగా ఏడుస్తూ...

Last Updated : Jun 7, 2022, 7:29 PM IST

ABOUT THE AUTHOR

...view details