తెలంగాణ

telangana

ETV Bharat / state

'30 రోజుల పాటు ట్రాఫిక్​పై​ అవగాహన కార్యక్రమాలు' - jubilee hills traffic police conducted national road safety awareness programs

జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో ట్రాఫిక్​ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ట్రాఫిక్​ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధించారు. వాహనం నడిపే సమయంలో హెల్మెట్ లేకపోతే జరిగే పరిణామాలను వాహనచోదకులకు వివరించారు.

national road safety awareness, jubilee hills traffic police
జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు

By

Published : Jan 20, 2021, 4:25 PM IST

జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రత, నియమాలపై ట్రాఫిక్ పోలీసులు పలు రకాలుగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్ వద్ద హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుతున్న 30మందికి పోలీసులు చలాన్లు విధించారు.

అదే విధంగా వాహనం నడిపే సమయంలో హెల్మెట్ లేకపోతే జరిగే పరిణామాలను వాహన చోదకులకు వివరించారు. వారి చేత ప్లకార్డులు పట్టించి ఇతరులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తామంటూ వారిచేత ప్రమాణం చేయించారు.

ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు ఈ 30 రోజులపాటు పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్​పెక్టర్ ముత్తు తెలిపారు.

ఇదీ చదవండి:'కేటీఆర్​ను సీఎం చేయడానికి కేసీఆర్ దోషనివారణ​ పూజలు చేశారు'

ABOUT THE AUTHOR

...view details