తెలంగాణ

telangana

ETV Bharat / state

Jubilee Hills Thief Found : జూబ్లీహిల్స్ దొంగ దొరికాడు... గోడలు ఎత్తు తక్కువ ఉన్నాయని చూసి చోరీకి వచ్చాడు.. - hyderabad crime news

Jubilee Hills Thief Found : జూబ్లీహిల్స్​లోని వ్యాపారి ఇంట్లో చోరి చేసిన దొంగ పట్టుబడ్డాడు. రూ.10 లక్షలతో పరారైన సీసీటీవీ పూటేజీల ఆధారంగా గుర్తించారు. ఆ వ్యక్తి సికింద్రాబాద్​ రాజేష్​ యాదవ్​అని తెలిపారు. అతనికి చాలా అప్పులున్నాయని వాటిని తీర్చడానికే దొంగతనానికి పాల్పడ్డాడని పోలీసులు అన్నారు.

Jubilee Hills Thief Found
Jubilee Hills Thief Found

By

Published : May 28, 2023, 10:49 AM IST

Jubilee Hills Thief Found After 15days : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11న ఇంట్లో ఇద్దరు మహిళలను కత్తితో బెదిరించి సుమారుగా రూ.10 లక్షల పరారైన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు సికింద్రాబాద్​కు చెందిన రాజేష్ యాదవ్. పోలీసుల తెలిపిన సమాచారం మేరకు..

Jubilee Hills Theft Found After 15days : జూబ్లీహిల్స్ రోడ్ నంబరు-52లో నివసించే వ్యాపారి ఎన్ఎస్ఎన్ రాజు ఇంట్లోకి ప్రవేశించిన దొంగ, గర్భిణి అయిన ఆయన కుమార్తె నవ్య మెడపై కత్తి పెట్టి నగదు దోచుకెళ్లిన సంగతి విదితమే. మొదట ఒంటిపై ఉన్న నగలు, బంగారం ఇచ్చినా వద్దు కేవలం డబ్బు మాత్రమే కావాలని బెదిరించాడు. వాళ్ల చరవాణి నుంచే మెసేజ్​లు చేసి రూ.10 లక్షలు తెప్పించుకొని అక్కడ నుంచి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టిన పోలీసులు 15 రోజులుగా నిందితుడి కోసం గాలించారు.

Jubilee Hills Theft Found After 15days : సీసీ పుటేజీని పరిశీలించడంతో పాటు వేలిముద్రలు సేకరించారు. వేలిముద్రలు లభ్యం కాకపోవడంతో సాంకేతికత ఆధారంగా నిందితుడు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన రాజేష్ యాదవ్​గా గుర్తించారు. అప్పుల బాధ ఎక్కువ కావడంతో దొంగతనం చేసి తీర్చాలనుకున్నాడు. జూబ్లీహిల్స్లోని పలు ప్రాంతంలో పర్యటించాడు. అన్నింటికీ గోడలు ఎత్తుగా ఉండి, కాపలాదారులు సైతం ఉండటాన్ని గుర్తించాడు. ఈ క్రమంలో ఎన్ఎస్ఎన్ రాజు ఇంటి గోడలు ఎత్తు తక్కువగా ఉండటంతో లక్ష్యంగా చేసుకున్నాడు. రాజు కుమార్తె మెడపై కత్తి, పెట్టి నగదు కావాలంటూ డిమాండ్ చేశాడు. ఆభరణాలు ఇచ్చినా తిరస్కరించాడు. తొలుత పాతిక లక్షలు డిమాండ్ చేసి, చివరకు ఇంట్లో ఉన్న రూ. 2 లక్షలతో పాటు, బయటి నుంచి అల్లుడు పంపించిన డబ్బులతో కలిపి మొత్తం రూ.10 లక్షలు తీసుకుని ఉడాయించాడు.

Thefts in Hyderabad : జూబ్లీహిల్స్​ వ్యాపారి ఇంట్లో చోరీ.. పోలీసులకు అనేక అనుమానాలు

Jubilee Hills Theft Found After 15days : శామీర్​పేట్​ సమీపంలోని ఒక రిసార్ట్​లో స్నేహితులకు విందు ఇస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. నిందితుడు రూ.2.50 లక్షలతో రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. వాహనంతో పాటు కొంత నగదును స్వాధీనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎంత ప్లాన్​ చేసిన దొరికిపోయాడు:ముందే ప్రణాళిక చోరీ చేయడం తొలిసారి. కావడంతో ముందుగా దానిపై అవగాహన పెంచుకున్నాడు. తన చరవాణి నుంచి ఫోన్ చేస్తే తెలుస్తుందని, నవ్య చరవాణి నుంచి క్యాబ్ చేసుకొని షాద్​నగర్​ వెళ్లాడు. అక్కడ షాపింగ్ చేస్తూ సీసీ కెమెరాల్లో చిక్కి తాను వేరే ప్రాంతానికి వెళ్లడానికి అవసరమైన సామగ్రి కొనుగోలు చేసినట్లుగా పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి మరో క్యాబ్లో రాంగోపాల్ పేటలోని తన నివాసానికి వెళ్లాడు. నిందితుడి కదలికల ఆధారంగా వేరే రాష్ట్రానికి పారిపోయి ఉంటాడని భావించి అటువైపు దృష్టి సారించారు.. కేసులో దాదాపు 30 మంది పోలీసు అధికారులు నిందితుడిని గుర్తించేందుకు శ్రమించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details