బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో బోరబండలో ఏర్పాటు చేసిన భూముల థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత బలహీన వర్గాల వారికి చెందిన ఇళ్లను థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయించడం ఒక్క కేసీఆర్‌కే చెందుతుందని గోపీనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.