JP Nadda tour in Telangana: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 16వ తేదీతో ముగియనున్నది. దీనిలో భాగంగా కరీంనగర్లో భారీ బహిరంగ సభకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇందులో పాల్గొంటారని ముఖ్యనేతలు పేర్కొన్నారు.
ఈనెల 16న రాష్ట్రానికి జేపీ నడ్డా.. కరీంనగర్లో భారీ సభకు ఏర్పాట్లు - BJP latest news
JP Nadda tour in Telangana: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 16న రాష్ట్రానికి రానున్నట్లు ఆ పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. బండి సంజయ్ చేస్తున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కరీంనగర్లో జరిగే ముగింపు సభలో ఆయన పాల్గొని.. మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
JP Nadda
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటీవల కొద్దికాలంగా తమ దృష్టి దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రీకరించింది. దానికి తోడు నేటితో గుజరాత్లో చివరిదశ ఎన్నికల పోలింగ్ ముగియడంతో దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయలని కమలదళం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఇవీ చదవండి: