తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత శుభ్రత పాటించాలి' - సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 1వ వార్డులో జేపీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని 1వ వార్డులో జేపీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ స్వీయనియంత్రణ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.

jp fans association distributed masks to poor people at cantonment area in secunderabad region
జేపీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

By

Published : Jul 1, 2020, 2:14 PM IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని బాపూజీనగర్, నేతాజీనగర్, ఆర్య సమాజ్, కంసరి బజార్ ప్రాంతాల్లో జేపీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు మూడు వేల మాస్కులు పంపిణీ చేశారు. నగరంలో కేసులో భారీగా పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని అసోషియేషన్‌అధ్యక్షుడు జంపన రవీందర్ కోరారు.

అనంతరం బోయిన్‌పల్లిలోని రెడ్‌క్రాస్ ఆస్పత్రిలో అకౌంటెంట్‌గా సేవలు అందించిన మనోరమ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెను శాలువతో సత్కరించారు.

ఇదీ చూడండి:కరోనాతో దేశంలో ఒక్కరోజే 507 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details