ఆధ్యాత్మీక, సామాజిక, రాజకీయ అంశాలతో పాటు చిత్రకారులు లైవ్‌గా రూపొందించిన చిత్రకళ ప్రదర్శన కళాభిమానులు ఆకట్టుకున్నాయి. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో జర్నీ ఆఫ్ ద కాన్వాస్ పేరిట చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రముఖ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అందమైన చిత్రాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సంప్రదాయ, భారతీయ ఇతివృత్తాలను ఆధునిక కళాకృతుల అంశాలతో ప్రేమ, జీవితం, భావోద్వేగం, భక్తిని కలగలిపి రంగులతో ప్రత్యేకతను కళాకారులు ప్రత్యేకతను చాటుకున్నారు. ముంబయి, బెంగళూరు, వైజాగ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన గాంధీ గీసిన చిత్రాలకు చిత్ర కళాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రతి ఏడాది విభిన్న ప్రాంతాలకు చెందిన కళాకారులను నగరవాసులకు పరిచయం చేసేందుకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
జర్నీ ఆఫ్ ద కాన్వాస్@ చిత్రకళ ప్రదర్శన - madhapur
మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో జర్నీ ఆఫ్ ద కాన్వాస్ పేరిట ఏర్పాటు చేసిన చిత్రకళ ప్రదర్శన చూపరులను అలరించాయి. చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన అందమైన చిత్రాలు ఆకట్టుకున్నాయి.
చిత్రకళ ప్రదర్శన