సిద్దిపేట జిల్లాకు చెందిన సుమారు 21 మంది హైదరాబాద్ లంగర్‌హౌస్ ప్రాంతంలో తమ బంధువుల 40 రోజుల దినకర్మకు వచ్చి.. లాక్‌డౌన్‌తో ఇక్కడే చిక్కుకుపోయారు. మధ్య తరగతి కుటుంబం కావడం వల్ల ఓ పూట తింటూ మరో పూట పస్తులుంటున్నారు.
మానవత్వం చాటిన పాత్రికేయుడు - siddipet
లాక్డౌన్ వల్ల తమ బంధువుల ఇంట్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి ఓ పాత్రికేయులు అండగా నిలిచారు. నిత్యావసరాలు, నగదు అందించారు.
మానవత్వం చాటిన పాత్రికేయుడు
విషయం తెలుసుకున్న సయ్యద్ ఇమ్రాన్ అలీ అనే పాతబస్తీకి చెందిన పాత్రికేయులు వారికి అండగా నిలిచారు. ఓ నెలకు సరిపడా బియ్యం, కూరగాయలు, వంట సామగ్రి, కొంత నగదు అందించారు. తమ బాధ తెలుసుకొని సహాయం చేసిన పాత్రికేయునికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:పేగు కణాలపైనా కరోనా దాడి