ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెరాస నేత, మాజీ మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. హైదరాబాద్ శివారులోని హైదర్‌గూడాలో కేవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు.
ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన వేణుగోపాలాచారి - హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మధుసూధనాచారి
మహిళలు చిన్న తరహా పరిశ్రమలను ప్రారంభిస్తే ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుందని తెరాస నేత, మాజీ మంత్రి వేణుగోపాలాచారి అన్నారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడాలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు.
ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన మాజీ సభాపతి
మహిళలు ఇంటికే పరిమితం కాకుండా సొంతంగా చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం 2 నుంచి 5 లక్షల వరకు సబ్సిడీని అందిస్తుందని వేణుగోపాలాచారి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో మహిళలు నెలసరి సమయంలో ఉపయోగించే ప్యాడ్ల తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఇదీ చదవండి:పాస్‌పోర్టు కుంభకోణంలో 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్