తెలంగాణ

telangana

ETV Bharat / state

Joinings Josh in BRS Party : బీఆర్​ఎస్​లో చేరికల జోరు.. ప్రతిరోజూ ఒకరిద్దరు ముఖ్య నేతలకు గులాబీ కండువా కప్పేలా ప్రణాళికలు - telangana latest political news

Joinings Josh in BRS Party : చేరికలతో బీఆర్​ఎస్​లో జోష్ పెరిగింది. పలువురు నేతలు పార్టీని వీడుతుండటంతో.. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే వ్యూహాన్ని అనుసరిస్తోంది అధికార బీఆర్​ఎస్​. ప్రతిరోజూ ఒకరిద్దరు నేతలకు గులాబీ కండువా కప్పేలా ప్రణాళికలు చేశారు. కాంగ్రెస్, బీజేపీతో పాటు.. పలువురు సీనియర్ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది.

Joinings in BRS
Various Parties Leaders Join in BRS

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2023, 7:17 AM IST

Various Parties Leaders Join in BRS బీఆర్​ఎస్​లో చేరికల జోరు.. మారుతున్న రాజకీయ సమీకరణాలు

Joinings Josh in BRS Party:పలువురు నేతలు పార్టీని వీడుతుండగా.. అందుకు కౌంటర్‌గా ఇతర పార్టీల నేతలను అధికార బీఆర్​ఎస్(BRS)​ చేర్చుకుంటోంది. శుక్రవారం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి.. ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి కేటీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. మేడ్చల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్​ సమక్షంలో.. రాగిడి లక్ష్మారెడ్డి, పలువురు ఉప్పల్ కాంగ్రెస్ నేతలు గులాబీ పార్టీలో చేరారు.

TDP leader Ravula Chandrasekhar Reddy joining BRS : బీఆర్​ఎస్​లో​ చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డి

Joinings in BRS :జనగామ సభలో మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. గులాబీ కండువా కప్పుకున్నారు. మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌కు కాంగ్రెస్ టికెట్ ఖరారు కాగానే మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ను చేర్చుకొని వెంటనే ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి బీఆర్​ఎస్​లో చేరగా.. మెదక్ నియోజకవర్గ ఇంఛార్జీగా బాధ్యతలు అప్పగించారు.

ఖమ్మంలో అంతకు ముందు తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్​ఎస్​లో చేరగా.. ఆయనకు భద్రాచలం టికెట్ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిన్నసత్యనారాయణ, వైఎస్​ఆర్​టీపీ నాయకుడు, గాయకుడు సోమన్న, దేవరకొండ నేత బిల్యా నాయక్ బీఆర్​ఎస్​లో చేరారు. గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకే గంగాధరరావుతో పాటు మెదక్ నియోజకవర్గ టీడీపీ నేత మైనంపల్లి రాధాకిషన్ రావు, రాష్ట్ర తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ ఏకే రమేశ్‌చందర్‌లు బీఆర్​ఎస్​లో చేరారు.

Political Heat in Paleru Constituency : రసవత్తరంగా పాలేరు పోరు.. ముఖ్య నేతల పోటీతో మారిన రాజకీయ సమీకరణాలు

Telangana Assembly Elections 2023 : కేసీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఉద్యమ నేత చెరుకు సుధాకర్ తదితరులు నేడో, రేపో బీఆర్​ఎస్​లో చేరతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలో టికెట్ దక్కని నేతలను ఆకర్షించే వ్యూహంతో గులాబీ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్​ఎస్​ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి గులాబీ పార్టీలోని అసంతృప్తులు బయటకు వచ్చారు.

అయితే కేసీఆర్​, మంత్రులు కేటీఆర్​, హరీశ్‌రావు రంగంలోకి దిగి.. చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అధిష్టానం జోక్యంతో పలు చోట్ల పరిస్థితులు సద్దుమణిగినా కొన్నిచోట్ల అలాగే కొనసాగుతోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌, స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్య, జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని బుజ్జగించి.. పార్టీ అభ్యర్థులకు సహకరించేలా ఒప్పించారు.

పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి పార్టీ వీడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే పలు నియోజకవర్గాల్లో అసంతృప్తితో పలువురు నేతలు పార్టీని వీడారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు.. ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, రేఖానాయక్‌ సహా పలువురు నేతలు బీఆర్​ఎస్​ను వీడి హస్తం పార్టీలో చేరారు. కొందరు అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్న బీఆర్​ఎస్​.. మరికొందరి విషయంలో చూసీచూడనట్లు వదిలేస్తోంది. పార్టీ వీడతామని హెచ్చరిక చేస్తున్నా తేలిగ్గా తీసుకుంటోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ ప్రత్యర్థులకు కౌంటర్‌ ఇచ్చే వ్యూహం అమలు చేస్తోంది.

KTR Tweet on BRS Candidates List : టికెట్​ దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం ఇస్తామన్న కేటీఆర్.. మైనంపల్లి వ్యాఖ్యలపై సీరియస్

ABOUT THE AUTHOR

...view details