కాంగ్రెస్‌లో చేరికల కోలాహలం Telangana Congress Joinings Updates :కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఇటీవల తరచూ ఉంటున్నప్పటికీ.. ఇప్పటి వరకు పెద్ద నాయకులు చేరిన దాఖలాలు లేవు. పలువురు నేతలు హస్తం పార్టీలో చేరుతారని ప్రచారం జోరందుకున్నప్పటికీ.. ఈనెల మొదటి, రెండు వారాల్లో మంచి రోజులు లేకపోవడం, పార్టీలో చేరేందుకు చొరవ చూపుతున్న నాయకుల సీట్ల సర్దుబాటు పూర్తి కాకపోవడంతో పార్టీలో చేరికలు జరగలేదు. రెండు వారాల్లో చేరికల కోలాహలం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పార్టీలో చేరేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోరుతున్న సీట్లు.. సర్దుబాటు కాకపోవడంతోనే అధికారిక ప్రకటన ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
Ponguleti Joins Congress :ఈ నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వద్ద సీట్ల సర్దుబాటు అంశంతో పాటు వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీని విలీనం చేయించడం, ఆమె పోటీ చేసిన చోట మద్దతు ఇచ్చి గెలుపునకు సంహకరించడం.. తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Jupally joins Congress Party :ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర, భద్రాచలం అసెంబ్లీ సీట్లు మినహా అన్ని స్థానాల్లో తాను సూచించిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని పొంగులేటి కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందంతో పాటు పొంగులేటి కూడా ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా సర్వేలు చేయించినట్లు సమాచారం. వీటి ఆధారంగానే తాను అడిగిన టికెట్లు ఇస్తే గెలిపించుకుంటానని పొంగులేటి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు ముందుకు వేస్తోంది.
BRS Leader Srihari join in Congress Party Today :పొంగులేటి అడిగిన విధంగా కాకుండా ఐదు సీట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పొంగులేటికి ఐదు సీట్లు కేటాయించడం వల్ల స్థానిక నాయకులకు అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయ పదవులు ఇస్తామని ఆశావహులకు హస్తం హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా ఉంటుందని రాజకీయ వర్గాల అంచనా. మరోవైపు నిర్మల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీహరి తన అనుచరగణంతో ఇవాళ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇంఛార్జి ఠాక్రేల సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
ఇవీ చదవండి :