జమ్ము కశ్మీర్-లద్దాఖ్‌లోని "జో జిల్లా'' పాస్ టన్నెల్ టెండర్లు తమకే దక్కాయని జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్-ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ తెలియచేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ నిర్మాణ పనుల కోసం గత నెల 30న తమతో పాటు మరో మూడు సంస్థలు బిడ్‌లు వేసినట్లు తెలిపింది.
మొదటి స్థానం...
టెండర్ కొటేషన్లో తమ సంస్థ మొదటి స్థానంలో నిలవడం వల్ల తమకే ఆ కాంట్రాక్ట్ పనులు దక్కాయని వెల్లడించింది. ఇతర రెండు సంస్థల కంటే తక్కువ ధర రూ.4509.5 కోట్లు మొత్తానికి కోట్ చేయడంతో తమ సంస్థ మొదటి స్థానంలో నిలిచిందని ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ వెల్లడించింది.
రెండు నిర్మించాల్సి ఉంది...
మొత్తం 33 కిలోమీటర్లు మేర టన్నెల్స్‌తో కూడిన రహదారిని నిర్మించాల్సి ఉందని వివరించింది. ఇందులో రెండు భాగాలు ఉండగా.. మొదటి భాగం 18.5 కిలోమీటర్లు పొడవు రహదారి కాగా అందులో 2 కిలోమీటర్లు ఒకటి, అర కిలోమీటర్ మరొకటి రెండు టన్నెల్స్ నిర్మించనున్నట్లు చెప్పుకొచ్చింది. రెండో భాగంలో 9.5 మీటర్లు వెడల్పు, 7.57 మీటర్లు ఎత్తు పద్ధతిలో గుర్రపు నాడా ఆకారంలో 14.15 కిలోమీటర్లు మేర రహదారిని నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొంది.