తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2021, 2:21 PM IST

ETV Bharat / state

గుర్రం పైనుంచి పడి జాకీ మృతి.. విమానంలో స్వస్థలానికి మృతదేహం

హైదరాబాద్‌ రేస్ క్లబ్‌లో గుర్రం పైనుంచి కిందపడి మృతి చెందిన జాకీ... కుటుంసభ్యులకు పరిహారంగా 15 లక్షల రూపాయలు అందించనున్నామని రేస్‌క్లబ్‌ ఇంఛార్జీ కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ పోస్టుమార్టం ముగియగానే మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో అతని స్వస్థలమైన జైపూర్‌కు పంపించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు స్పష్టం చేశారు.

jockey Jitender Singh died while horse race in hyderabad race club
'గుర్రం పైనుంచి పడిన జాకీ మృతికి పరిహారంగా 15 లక్షలు'

హైదరాబాద్ మలక్‌పేట రేస్‌ కోర్టుకు చెందిన జాకీ జితేందర్ సింగ్ తలకు బలమైన గాయం కావడంతోనే మృతి చెందారని రేస్‌క్లబ్‌ ఇంఛార్జీ కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. నిన్న ఆదివారం సాయంత్రం జరిగిన 4వ రేస్‌లో రేస్‌ గుర్రం నుంచి పట్టుతప్పి కిందపడగా వేరే గుర్రం అతనిపై పడడంతో తలకు తీవ్ర గాయమైందని ఆయన పేర్కొన్నారు. వెంటనే జితేందర్‌ సింగ్‌ను మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు.

ఇవాళ పోస్టుమార్టం ముగియగానే మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో అతని స్వస్థలమైన జైపూర్‌కు పంపించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మృతుడు జితేందర్ సింగ్ కుటుంసభ్యులకు పరిహారంగా 15 లక్షల రూపాయలు అందించనున్నామని పేర్కొన్నారు. మృతుడు జితేందర్ సింగ్ ఈ రేస్‌కోర్టులోనే మూడు నెలల శిక్షణ తీసుకున్నారని... శిక్షణ పూర్తయిన నాలుగో ఏడాదిలో రేస్‌లో పాల్గొన్నాడని కిరణ్‌కుమార్ రెడ్డి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details