ECLAT Jobs in Hyderabad:అమెరికాకు చెందిన ప్రసిద్ధ వైద్య సాంకేతిక సేవల సంస్థ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ వరంగల్, ఖమ్మంలలో కొత్తగా పంపిణీ కేంద్రాలను స్థాపించనుంది. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్‌లలో ఉన్న క్యాప్టివ్ కేంద్రాలను విస్తరించనుంది. వీటి ద్వారా మొత్తం 1,400 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుంది. సంస్థ సీఈవో కార్తీక్ పొల్సాని, ముఖ్య నిర్వహణ అధికారి స్నేహల నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావును కలిసింది. తమ ప్రతిపాదనలను వివరించింది. 2016లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సంస్థ కరీంనగర్‌లో 200 మందితో కూడిన క్యాప్టివ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత హైదరాబాద్‌లో 300 మందితో మరొకటి స్థాపించింది. తాజా ప్రతిపాదనల ప్రకారం కొత్తగా హైదరాబాద్‌లో 500, కరీంనగర్‌లో 300 మందికి ఉపాధి కల్పించనున్నారు. వరంగల్, ఖమ్మంలలో ఏర్పాటు చేసే కేంద్రాల్లో మూడేసి వందల మందికి ఉపాధి లభిస్తుంది. భవిష్యత్తులో తమ కేంద్రాలను మరింత పెంచుతామని తెలిపింది. తెలంగాణ ప్రగతికి సహకరిస్తామని కార్తీక్, స్నేహ చెప్పారు. కేటీఆర్ ఎక్లాట్ ప్రతినిధులను అభినందించారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు మరింత ఊతం: కేటీఆర్