'ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ నంబర్ వన్' - job-connect
ఉద్యోగాల కల్పనలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. యూసఫ్‌గూడలో నగర పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో ఆయన పాల్గొన్నారు.
ఉద్యోగ మేళ
ఉద్యోగాల కల్పనలోను, వ్యాపారానికి అనువైన సౌకర్యాలలోను హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. యూసఫ్‌గూడలో నగర పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి యువత అంతా అదృష్టవంతులని ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలున్నాయని పేర్కొన్నారు.