తెలంగాణ

telangana

ETV Bharat / state

డిగ్రీ, బీటెక్​లతో​ అమెజాన్‌లో ఉద్యోగం

మా అమ్మాయి పదో తరగతి చదువుతోంది. అమెజాన్‌ లాంటి సంస్థలో ఉద్యోగం సంపాదించాలంటే ఏ కోర్సు చదవాలి? - కె. భాను

job at Amazon with BTech or Degree
డిగ్రీ, బీటెక్​లతో​ అమెజాన్‌లో ఉద్యోగం

By

Published : Apr 25, 2022, 12:41 PM IST

అమెజాన్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగం సంపాదించాలంటే, మీ అమ్మాయిని కనీసం డిగ్రీ చదివించండి. బీటెక్‌ డిగ్రీ చదివితే ఎక్కువ ఉపయోగకరం. బీటెక్‌ ఏ బ్రాంచ్‌లో చేసినా, ఇంజినీరింగ్‌ అర్హత ఉన్న ఉద్యోగాలతో పాటు సాధారణ డిగ్రీ అర్హత ఉన్న చాలా ఉద్యోగాలకు కూడా ప్రయత్నించవచ్చు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డేటా సైన్స్‌ లాంటి బ్రాంచిలు చదివితే ఎక్కువ ఉద్యోగావకాశాలుంటాయి. డిగ్రీ తరువాత ప్రసిద్ధ విద్యాసంస్థల్లో ఎంబీఏ/ఎంటెక్‌ చేసినట్లయితే మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఇంజినీరింగ్‌ కోర్సులయినా, మేనేజ్‌మెంట్‌ కోర్స్‌ అయినా అత్యుత్తమ జాతీయ విద్యాసంస్థల్లో చదవడం శ్రేయస్కరం. మెరుగైన కెరియర్‌ కోసం విషయ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్‌, ప్రాబ్లెమ్‌ సాల్వింగ్‌, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు, టీంబిల్డింగ్‌, టీంవర్కింగ్‌ స్కిల్స్‌, సృజనాత్మకత చాలా అవసరం.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details