ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకోవద్దని స్పష్టం చేసినట్టు హైకోర్టుకు జేఎన్టీయూహెచ్ నివేదించింది. కాలేజీల అనుబంధ గుర్తింపు నిబంధనలోనూ చేర్చినట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేస్తామని తెలిపింది.
'ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకోవద్దు' - students original certificates
ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకోవద్దని స్పష్టం చేసినట్టు హైకోర్టుకు జేఎన్టీయూహెచ్ నివేదించింది. కాలేజీల అనుబంధ గుర్తింపు నిబంధనలోనూ చేర్చినట్లు వెల్లడించింది.

'ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకోవద్దు'
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు వ్యవహహరిస్తున్నాయని ఫోరం ఆగేనెస్ట్ కరప్షన్ దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కాలేజీలు ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకున్నట్టు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఓయూ తెలిపింది. ఓయూ, జేఎన్ టీయూహెచ్ నివేదికలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. పిల్‌పై విచారణను ముగించింది.
ఇదీ చూడండి :'ఆ ముస్లిం ఉద్యోగులు గంట ముందే వెళ్లొచ్చు'