తెలంగాణ

telangana

ETV Bharat / state

'జేఎన్​టీయూలో పరిశోధనలు, ఇన్నోవేషన్​కు కృషి చేయాలి' - తెలంగాణ వార్తలు

పూర్వ విద్యార్థుల సహకారంతో జేఎన్​టీయూను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని గవర్నర్​ తమిళిసై సౌందర్​రాజన్​ సూచించారు. ఈ మేరకు గవర్నర్​ను యూనివర్సిటీ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి రాజ్​భవన్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పరిశోధనలపై ఉపకులపతికి గవర్నర్​ పలు సూచనలు చేశారు.

jntu vice chancellor met governor
గవర్నర్​ను కలిసిన జేఎన్​టీయూ ఉపకులపతి

By

Published : May 26, 2021, 11:22 AM IST

జేఎన్​టీయూలో పూర్వ విద్యార్థుల నెట్​వర్క్​ను బలోపేతం చేయాల్సిందిగా ఉపకులపతి ప్రొఫెసర్ కట్టా నరసింహా రెడ్డికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయన.. గవర్నర్​ను రాజ్ భవన్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. పూర్వ విద్యార్థుల సేవలు ఉపయోగించుకొని యూనివర్సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా కొనసాగాలని గవర్నర్ పేర్కొన్నారు. యూనివర్సిటీలో పరిశోధనలు, అభివృద్ధి, ఇన్నోవేషన్ పెంపుదలకు కృషి చేయాలని సూచించారు.

ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సైన్స్, టెక్నాలజీ రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడానికి అభివృద్ధి పరిశోధనలు, ఇన్నోవేషన్ అత్యంత ఆవశ్యకమని తమిళిసై పేర్కొన్నారు. అనంతరం కట్టా నరసింహా రెడ్డి తాను రచించిన నానో టెక్నాలజీ అనే పుస్తకం, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో గతంలో వైస్ ఛాన్స్​లర్​గా రిటైర్ అయినప్పుడు సహచరులు, శ్రేయోభిలాషులు ప్రచురించిన మరో పుస్తకాన్ని గవర్నర్​కు అందజేశారు.

ఇదీ చదవండి:పండగ పేరుతో రైల్వే బాదుడు.. వలస కార్మికులపై అదనపు ఛార్జీలు

ABOUT THE AUTHOR

...view details