హైదరాబాద్ జియాగూడ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తెరాస అభ్యర్థి మిత్ర కృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సాయం అందని వరద బాధితులకు 10వ తేదీ అనంతరం ఇస్తామని చెప్పారు.
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: తెరాస అభ్యర్థి - జీహెచ్ఎంసీ ఎన్నికల లేటెస్ట్ వార్తలు
సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని జియాగూడ డివిజన్ తెరాస అభ్యర్థి మిత్ర కృష్ణ ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
![సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: తెరాస అభ్యర్థి jiyaguda trs corporator candidate mitra krishna campaing in division](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9642452-thumbnail-3x2-na.jpg)
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: తెరాస అభ్యర్థి
ఇన్నిరోజులు ప్రజా సమస్యలు పట్టని ఇతర పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నాయని అన్నారు. జియాగూడలో ఓటు అడిగే హక్కు కేవలం తెరాసకే ఉందని చెప్పారు. గతం కన్నా అధిక మెజారిటీతో గెలుస్తానని తెలిపారు.
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: తెరాస అభ్యర్థి
ఇదీ చదవండి:ఒక్కటే బాకీ ఉంది... అది కూడా నెరవేరుస్తా: కేటీఆర్