తెలంగాణ

telangana

ETV Bharat / state

JIVIKA AAYUR SCIENCES: హైదరాబాద్​లో త్వరలో జీవికా ప్లాంట్​.. వెయ్యి మందికి ఉద్యోగాలు - Jivika Ayurveda Sciences latest news

హైదరాబాద్(HYDERABAD)​ జీనోం వ్యాలీ(GENOME VALLEY) మరో నూతన తయారీ పరిశ్రమకు వేదిక కానుంది. ఈ ఏడాది చివరి నాటికి జీవికా ఆయుర్​ సైన్సెస్(JIVIKA AAYUR SCIENCES)​ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ఫార్మా కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు. తద్వారా దాదాపు 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Jivika Ayurveda Sciences
జీవికా ఆయుర్​ సైన్సెస్​

By

Published : Sep 6, 2021, 10:26 PM IST

ప్రముఖ ఆయుర్వేద మందుల తయారీ కంపెనీ జీవికా ఆయుర్ సైన్సెస్(JIVIKA AAYUR SCIENCES).. రాష్ట్రంలో నూతన తయారీ పరిశ్రమ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. మొత్తం రూ.120 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్​ (HYDERABAD) జీనోం వ్యాలీ(GENOME VALLEY)లో నెలకొల్పే నూతన యూనిట్‌ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెస్తామని జీవికా ఫార్మా వ్యవస్థాపకులు, సీఈవో మణి వర్గీస్ ప్రకటించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, పరిశ్రమ ఏర్పాటుకు తగిన వాతావరణం ఉన్నందునే హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు.

హైదరాబాద్​లో త్వరలో జీవికా ప్లాంట్: డాక్టర్​ విల్సన్​

'జీవికా ఆయుర్​ సైన్సెస్​ తయారీ పరిశ్రమకు హైదరాబాద్​ అనుకూలంగా భావించాం. 120 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం. ఈ ఫార్మా కంపెనీ ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఆయుర్వేద మందుల తయారీ కోసం.. వ్యవసాయం రంగంలో తెలంగాణ వాతావరణం అనుకూలిస్తుంది. అందుకే ఈ రాష్ట్రాన్ని ఎంచుకున్నాం.' -డాక్టర్​ విల్సన్​, జీవికా ఆయుర్​ సైన్సెస్​ ప్రతినిధి

ఆయుర్వేద మందుల తయారీ పరిశ్రమ సహా పరిశోధన కేంద్రం, గ్లోబల్ మార్కెటింగ్ హెడ్ క్వార్టర్లను హైదరాబాద్‌లో నెలకొల్పుతామని మణి వర్గీస్‌ తెలిపారు. ఈ యూనిట్లలో 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. జీవికా ఆయుర్ సైన్సెస్ నుంచి 30రకాల ఆయుర్వేద మందులను ఈ అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తెస్తామని మణి వర్గీస్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి ఈ మందులను అమెరికా, బ్రిటన్​, లాటిన్ అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి:Hyderabad rain: అలర్ట్​ హైదరాబాద్‌... 6- 8 గంటల పాటు ఇళ్లల్లోనే ఉండండి

ABOUT THE AUTHOR

...view details