తెరాస జిల్లా కార్యాలయాలకు భూములు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం గతేడాది ఆగస్టులో ఇచ్చిన జీవో నెం.167 ను కూడా కొట్టివేయాలని ఆయన కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు జిల్లాల్లో కార్యాలయాలను 30 ఏళ్ల పాటు లీజుకిచ్చేలా.. లీజు ధర జిల్లాను బట్టి నిర్ణయించేలా 1987లో అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని సవరిస్తూ గతేడాది ఆగస్టులో ప్రభుత్వం ఇచ్చిన జీవో 167లో లీజు ప్రస్తావన తొలగించడమే కాకుండా ... చదరపు గజానికి 100 రూపాయలుగా నిర్ణయించడం చట్టవిరుద్ధమని సత్యం పిటిషన్లో పేర్కొన్నారు.
తెరాస కార్యాలయాలకు భూములు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ - illegal
తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాల భూముల కేటాయింపుకు వ్యతిరేకంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.
జీవో నెం.167 కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటీషన్ దాఖలు