తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజకీయాల్లో ఉన్న వారు బాధ్యతగా మాట్లాడాలి: పవన్ ​కల్యాణ్​ - జనసేన ఝాన్సీ లక్ష్మీభాయి జయంతి

PAWAN KALYAN COMMENTS: ఎంతటి కష్టాన్నైనా ఎదురించే శక్తి కల్గినా మహిళలే జనసేనకు స్పూర్తిదాయకమని జనసేన అధినేత పవన్ ​కల్యాణ్​ అన్నారు. పరాయి పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీభాయి గొప్పవారని గుర్తు చేశారు.

PAWAN KALYAN
PAWAN KALYAN

By

Published : Nov 19, 2022, 8:23 PM IST

PAWAN KALYAN COMMENTS: సమాజం కోసం బాధ్యతగా నిలబడేవారు ప్రజల కోసం పోరాడే మహిళలు.. ప్రస్తుత రాజకీయాలకు ఎంతో అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్​లోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఝాన్సీ లక్ష్మీభాయి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఝాన్సీ లక్ష్మీభాయిని ఆదర్శంగా తీసుకుని.. జనసేన మహిళా విభాగానికి ఆమె పేరు పెట్టినట్లు వివరించారు. రాజకీయాల్లో ఉన్న వారు బాధ్యతగా మాట్లాడాలని పేర్కొన్నారు.

కానీ, తెలుగు రాష్ట్రాలలో కొందరు మహిళా నాయకురాళ్లు బాధ్యత లేకుండా పోయిందని పవన్​ కల్యాణ్ విమర్శించారు. మహిళలపై అత్యాచారాల విషయంలో వాళ్లు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. జనసేన వీర మహిళలు చేస్తున్న పోరాటాలకు అక్రమార్కులు భయపడుతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.

రాజకీయాల్లో ఉన్న వారు బాధ్యతగా మాట్లాడాలి: పవన్ ​కల్యాణ్​


"ఇప్పుడు రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు . ఒకట్రెండు అత్యాచారాలు జరిగినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఆ మైండ్ సెట్​ను మనం మార్చాలి . ఓ అమ్మాయిపై అఘాయిత్యం చేసి హత్య చేశారు.. దివ్యాంగురాలైన ఆమె తల్లి న్యాయం కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా సమాజంలో చలనం లేకుండా పోయింది.. ఆడబిడ్డల సంరక్షణ చాలా ముఖ్యమైంది."- పవన్ కల్యాణ్ , జనసేన అధ్యక్షుడు

ఇవీ చదవండి:మర్రి శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన టీపీసీసీ

అంగరంగ వైభవంగా షిర్డీ సాయిబాబా ధూప్​ హారతి

ABOUT THE AUTHOR

...view details