మండపేట వైకాపా సభాస్థలిలో ప్రమాదం చోటు చేసుకుంది. జగన్ను చూసేందుకు వచ్చిన కార్యకర్తలు నిలబడిన భవన పిట్ట గోడ అకస్మాత్తుగా కుప్పకూలింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.
జగన్ ప్రచారసభలో అపశృతి.. గోడ కూలి ఒకరు మృతి
By
Published : Mar 27, 2019, 8:45 PM IST
జగన్ ప్రచారసభలో అపశృతి.. గోడ కూలి ఒకరు మృతి
ఏపీలోనితూర్పుగోదావరి జిల్లా మండపేటలో వైకాపా అధినేత జగన్ నిర్వహించిన ప్రచార సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రచార సమయంలో జగన్నుచూసేందుకు వైకాపా కార్యకర్తలు భవనంపైకి ఎక్కారు. అందరూ ఒక్కసారే పిట్టగోడపైకి రావడం వలన అకస్మాత్తుగాకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా,.. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలోఈటీవీ ప్రతినిధి వెంకటరమణతో సహా పలువురు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి.