తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని అడ్డుకోండి: జీవన్​ రెడ్డి - కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని అడ్డుకోండి: జీవన్​ రెడ్డి

కాలేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అతి పెద్ద అవినీతిని అడ్డుకోవాలంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి... రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇష్టమైన కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని ధ్వజమెత్తారు.

Jeevanreddy letter sent to governor about kaleshwaram project issue

By

Published : Oct 5, 2019, 4:42 PM IST

రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రచారంపై ఉన్న శ్రద్ధ.... పనులను పూర్తి చేసే విషయంలో లేదని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అతి పెద్ద అవినీతిని అడ్డుకోవాలంటూ ఆయన గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు బహిరంగ లేఖ రాశారు. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసేందుకు ప్రాజెక్టును రూపకల్పన చేసిన ప్రభుత్వం... తిరిగి మరో టీఎంసీ నీటిని ఎత్తి పోసేందుకంటూ రూ.4657.95 కోట్ల విలువైన పనులను నామినేషన్‌ కింద అప్పగించి భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. రాష్ట్రంలో ఓ జాతీయ ప్రాజెక్టు కావాలని అడిగినా...కాళేశ్వరం పేరును ప్రస్తావించలేదని చెప్పారు. నాలుగున్నర వేలకుపైగా విలువైన పనులను టెండర్‌ పిలువకుండా నామినేషన్‌ కింద పనులు ఏలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఈ పనులను రద్దు చేయడమే కాకుండా... వాటిని ప్రతిపాదించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని జీవన్​ రెడ్డి గవర్నర్​ను కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని అడ్డుకోండి: జీవన్​ రెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details