పార్టీలకు అతీతంగా జరుగుతున్నందున తెరాస ఎవరికి బీ ఫారాలను ఇవ్వలేదు. సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా, పూల రవీందర్ పీఆర్టీయూ తరఫున పోటీ చేశారు. వీరికి తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరికొందరు ప్రజాప్రతినిధులు పరోక్షంగా మద్దతు ఇచ్చారు.
అంచనాలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఫలితాలు - అలుగు బెల్లి నర్సిరెడ్డి
శాసనమండలి ఎన్నికల్లో ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు
జీవన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. నర్సిరెడ్డికి వామపక్షాలు, హస్తం పార్టీ, పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. పలు ఉపాధ్యాయ సంఘాలు బలపర్చడం వల్ల పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి రఘోత్తంరెడ్డి విజయం సాధించారు.
ఇదీ చూడండి :బ్యాలెట్ పోలింగ్‌కు ఇందూరు సిద్ధం
Last Updated : Mar 27, 2019, 11:49 AM IST