తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబంధుపై స్పష్టత ఇవ్వండి: జీవన్​రెడ్డి - mlc jeevan reddy latest news

రైతుబంధుపై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. . రైతుబంధు ఎన్ని ఎకరాలకు ఇస్తారో.. చెప్పాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల నియమాకానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

jeevan reddy speech on raithu bandhu
ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

By

Published : Mar 7, 2020, 3:19 PM IST

ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది భర్తీ చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి కోరారు. అదనపు సిబ్బంది లేకుండా కార్యాలయాల నిర్మాణంతో లాభం లేదని అభిప్రాయపడ్డారు. టెట్‌ నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

రైతుబంధు ప్రవేశపెట్టినప్పటి ఉత్సాహం ప్రభుత్వానికి ఇప్పుడు లేదన్నారు. ఈ పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు. రైతుబంధు ఎన్ని ఎకరాలకు ఇస్తారో.. చెప్పాలన్నారు. గత ప్రభుత్వ పథకాలను నిలిపివేసి.. కొత్త పథకాలు తీసుకురావడం సబబుకాదన్నారు.

రైతుకు ఇవ్వాల్సిన 4శాతం వడ్డీరాయితీని ప్రభుత్వం విడుదల చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయరంగానికి కల్పించే రాయితీలను సర్కార్​ తగ్గిస్తోందని ఆరోపించారు.

ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

ఇవీ చూడండి:నేను కేసీఆర్‌ బొమ్మతో గెలవలేదు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details