తెరాస ప్రభుత్వ హయాంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదని కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. విద్య, వైద్య, ఉద్యోగ రంగంలో కేసీఆర్ సర్కారు ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులకు 2 వేల కోట్లకు పైగా ధాన్యం బకాయిలు పేరుకుపోయాయని, వాటిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు ఏం నెరవేర్చారు' - congress
తెరాస ప్రభుత్వం ఎటువంటి ఆకాంక్షలు నెరవేరలేదని కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గాంధీభవన్‌లో మండిపడ్డారు. ఐదేళ్ల ప్రస్థానంలో ఏ ఒక్క హామీని కేసీఆర్ పూర్తిగా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కారు ఘోరంగా విఫలమైంది: జీవన్‌రెడ్డి