తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇకపై యాప్​లో విద్యుత్​ శాఖ పింఛన్​దారుల లైఫ్​ సర్టిఫికెట్​

తెలంగాణ విద్యుత్​ పింఛన్​దారులకు లైఫ్​ సర్టిఫికేట్​ సమర్పించేందుకు అధికారులు.. ప్రత్యేక యాప్​ను రూపొందించారు. ఈ సర్టిఫికెట్​ పొందేందుకు పెన్షనర్లు ఎక్కడకు తిరగాల్సిన అవసరం లేదని.. చరవాణి ద్వారానే పొందవచ్చని విద్యుత్​ శాఖ అధికారులు తెలిపారు. వయోవృద్ధులు, పదవీవిరమణ పొందిన వారికి ఈ యాప్​ ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు.

Jeevan pramaan app for pensioneers in telangana by electricity department
ఇకపై యాప్​లో విద్యుత్​ శాఖ పింఛన్​దారుల లైఫ్​ సర్టిఫికేట్​

By

Published : Nov 20, 2020, 11:01 AM IST

చరవాణితో తెలంగాణ విద్యుత్​ పెన్షనర్లకు లైఫ్​ సర్టిఫికెట్​ సమర్పించేందుకు విద్యుత్​ శాఖ.. ప్రత్యేక యాప్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఈ సర్టిఫికెట్​ను పొందేందుకు ఎక్కడకు తిరగాల్సిన అవసరంలేదని విద్యుత్​ శాఖ స్పష్టం చేసింది. ఈ యాప్​ను వినియోగించుకోవడానికి ఆండ్రాయిడ్​, యాపిల్​ ఫోన్​లో టీ-ఆప్​ పోలియోను డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్​లోని మొదటి పేజీలో పింఛనర్​ లైఫ్​ అథంటిఫికేషన్​ అనే ఐకాన్​ కనిపిస్తోంది. దాని టచ్​ చేస్తే పీఎల్​సీ- టీఎస్​ పవర్​ యుటిలిటీస్​ను క్లిక్​ చేయాలి. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత సబ్మిట్​ క్లిక్​ చేయాలి.

అనంతరం సబ్మిట్​ లైఫ్ సర్టిఫికేట్​ అండ్ రిసిప్ట్​ అనే భాగాలు కనిపిస్తాయి. మొదట పింఛన్​దారుని 7 నెంబర్ల ఐడీ/ పాన్​ నెంబర్, ఫోన్​ నెంబర్, పేరు) పూర్తి చేయాలి. తర్వాత ఫోటోను తీసుకుని సబ్మిట్​ చేస్తే వివరాల దరఖాస్తు పూర్తవుతుంది. కొద్ది రోజుల్లో మనం సమర్పించిన వివరాలు ఆమోదించబడ్డాక.. ఈ సంవత్సరానికి లైఫ్​ సర్టిఫికేట్ సమర్పించే పని పూర్తవుతుంది.

పెన్షనర్​ కార్యాలయానికి వెళ్లకుండా ఈ యాప్​ ద్వారా లైఫ్​ సర్టిఫికేట్​ సమర్పించవచ్చని విద్యుత్​ శాఖ అధికారులు వెల్లడించారు. ఇటువంటి యాప్​ను రూపొందించి వయోవృద్ధులు, పదవీవిరమణ పొందిన పింఛన్​దారుల పట్ల ఉదారతను చాటుకున్న సీఎండీ ప్రభాకర్​రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండిః14 మంది బలి- మృతుల్లో ఆరుగురు చిన్నారులు

ABOUT THE AUTHOR

...view details