తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇక మీదట జేఈఈ మెయిన్స్​​ తెలుగులోనే' - జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ వార్తలు

ఇంటర్​ విద్యార్థులకు శుభవార్త. జేఈఈ మెయిన్స్ ఇక మీదట తెలుగులో కూడా నిర్వహించనున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 2021 నుంచి మొత్తం 11 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

JEE MAINS EXAM CONDUCTED IN TELUGU REGIONAL LANGUAGE
'ఇక మీదట జేఈఈ మెయిన్​​ తెలుగులోనే'

By

Published : Nov 28, 2019, 11:03 AM IST

Updated : Nov 28, 2019, 2:39 PM IST

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ మెయిన్స్)ను ఇక మీదట తెలుగుభాషలో కూడా జరగనుంది. ఈ పరీక్షను మొత్తం 11 భాషలలో నిర్వహించడానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) సిద్ధమవుతోంది. అస్సామీ, బెంగాలీ, ఆంగ్లం, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్​, తెలుగు, ఉర్ధూ భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు.

ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ భాషల్లో మెయిన్స్ నిర్వహిస్తున్నారు. గుజరాతీకి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా ఇతర భాషలకు ఇవ్వాలని ఇటీవల పశ్చిమబంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ.. కేంద్రాన్ని అభ్యర్థించింది. దీనిని పరిశీలించిన కేంద్రం.. 11 భాషల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. 2020కి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసినందున 2021 నుంచి ప్రాంతీయ భాషల పరీక్షా పత్రం రూపొందించనున్నారు.

ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో సీటు పొందేందుకు జేఈఈ మెయిన్స్​ పరీక్ష రాయడం తప్పనిసరి. ఇందులో మార్కుల ఆధారంగానే ఐఐటీల్లోనూ ప్రవేశం లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి జేఈఈ పరీక్ష రాసేవారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ర్యాంకులు సాధించేవారు కూడా ఈ రెండు రాష్ట్రాల నుంచే అధికం.

'ఇక మీదట జేఈఈ మెయిన్స్​​ తెలుగులోనే'

ఇదీ చూడండి: నిజాయతీకి బదిలీ బహుమానం-ఖేమ్కా.. 53వ సారి

Last Updated : Nov 28, 2019, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details