జేఈఈ మెయిన్ రెండో విడత ఆన్లైన్ పరీక్షలు నేటి నుంచి ఈనెల 18 వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు ఆరున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షా 10 వేల మంది హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా 331 నగరాలు, పట్టణాల్లో... ఏపీలో 20, తెలంగాణలో 11 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తెలంగాణ, ఏపీలో...
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో.. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలో జేఈఈ మెయిన్ కేంద్రాలను సిద్ధం చేశారు.